పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
పినపాక, శోధన న్యూస్: పినపాక మండలంలోని ఏడూళ్ళ బయ్యారం,కరకగూడెం పోలీస్ స్టేషన్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్, కొత్తగూడెం ఓఎస్డీ టి సాయిమనోహర్ తో కలిసి బుధవారం రాత్రి ఆకస్మికంగా పర్యటించి తనిఖీ చేశారు.పినపాక,కరకగూడెం పోలీస్ స్టేషన్ల పరిధిప్రజల ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల సజావుగా జరిగిందేకు,పోలీసు అధికారులు అప్రమత్తంగా పని చేయాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించికునేందకు వారికి దైర్యం కల్పించాలని సూచించారు. మావోయిస్టుల కదిలకల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోని,ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అనంతరం ఏడూళ్ళ బయ్యారం చెక్ పోస్ట్ ను పరిశీలించారు.ఈ కార్యక్రమం లో మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావు, ఏడూళ్ళ బయ్యారం సిఐ శివ ప్రసాద్,కరకగూడెం ఎస్ఐ రాజారాం,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.