తెలంగాణ

పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  

పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  

మహబూబాబాద్, శోధన న్యూస్: మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగి్ జీ పాటిల్ బుధవారం మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించి రిసెప్షన్, ఆన్ లైన్ లో పిటిషన్ మేనేజ్మెంట్లో ఎంట్రీ చేసిన డాటాను, పిటిషన్ ఫైల్ లో ఉన్న ఎంక్వేరి రిపోర్ట్ ను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో నమోదయిన గ్రేవ్, నాన్ గ్రేవ్ సిడి ఫైల్స్ ను పరిశీలించి, పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పూర్తిచేయాలని ప్రతి సిడి ఫైల్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్, క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ గురించి సూచనలు చేశారు. సిసిటిఎన్ఎస్ ప్రాజెక్టులో నమోదు చేస్తున్న ఎఫ్ఐఆర్, సిడిఆర్, పార్ట్ వన్, పార్ట్ టు, డిమాండ్ డైరీ, చార్జిషీట్, ఇంటరాగేషన్ రిపోర్ట్, ను ఆన్ లైన్లో పరిశీలించారు. టీఎస్ కాప్ డయల్ 100, ఈ పెట్టి కేసులు‌, ఎఫ్ఆర్ఎస్ తదితర అప్లికేషన్లను, స్టేషన్ రికార్డ్స్ ను, పరిశీలించి, వర్టికల్ వారిగా విధులు నిర్వహించడంవల్ల సంబంధించిన వర్టికల్ లో పరిజ్ఞానం పెరిగి రెట్టింపు ఉత్సాహంతో పని చేయడం జరుగుతుందని తెలిపారు. 5s విధానాన్ని అమలు పరిచిన తీరును పరిశీలించారు. డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24×7 గస్తీ నిర్వహించాలని సూచించారు,పాత నేరస్థుల ఫై నిఘా పెట్టలని, రాత్రి వేళలో పెట్రొలింగ్ పెంచి దొంగతనాలు జరగకుండా చూడాలని ఆదేశించారు, గ్రామ స్థాయిలో ప్రజలతో సత్సంబంధాలు కలిగి యుండి, తరచుగా గ్రామాలను సందర్శిస్తూ, అక్కడి వారి సమస్యలు తెలుసుకుంటు వారి మౌలిక అవసరాలు పోలీసు శాఖ నుండి చేయవలసిన సహాయం గురించి పై అధికారులకు సమాచారం అందజేస్తూ, సమాచార సేకరణ చేయాలని తెలిపారు. అలాగే పోలీసు సిబ్బంది కి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. కమ్యూనిటీ పోలిసింగ్ ,ఫ్రెండ్లీ పోలిసింగ్ విధానన్ని అమలు పరచాలని ప్రజలకు ఎప్పుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *