తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

 ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆశిర్వదించాలి- మాజీ ఎమ్మెల్యే  పాయం

 ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆశిర్వదించాలి

– ప్రతి పేదవాడికి  గ్యారంటీ పథకాలు అందేలా కృషిచేస్తా

— మాజీ ఎమ్మెల్యే  పాయం వెంకటేశ్వర్లు

-కాంగ్రెస్ గూటికి 50 కుటుంబాలు

మణుగూరు, శోధన న్యూస్: ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆశిర్వదించి జరగబోయే ఎన్నికల్లో భారి మెజార్టీతో గెలిపించాలని పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కోరారు. మణుగూరు మున్సిపాలిటీలోని గాంధీబొమ్మ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు,హైదరాబాద్ యూత్, చేవెళ్ల ఎస్సి, ఎస్టి డిక్లరేషన్స్, ఆరు గ్యారంటీ పథకాలకు ఆకర్షితులై సుమారు 50  కుటుంబాల వారు బిఆర్ఎస్ పార్టీ, వివిధ పార్టీలను వీడి బుధవారం మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో  హస్తం గూటికి చేరారు. వేరికి మాజీ ఎమ్మెల్యే పాయం, ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్  తుళ్లూరి బ్రహ్మయ్యలు కాంగ్రెస్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రెండు సార్లు వచ్చినా ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు.  ఇంతక ముందు పథకాలు ఒక్కటి కూడా పేదవాళ్ళకి అందలేదని అన్నారు. పేద ప్రజలకి మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అని అన్నారు. మీ అమూల్యమైనా ఓటును కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు పై వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిరించాలని ఆయన కోరారు . ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *