ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి-మాజీ ఎమ్మెల్యే పాయం
ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి
- మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు, శోధన న్యూస్ : ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ తో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండల కేంద్రంలోని ఆదర్శనగర్ గ్రామంలో చల్ల శ్రీను ఆధ్వర్యంలో సుమారు 70 కుటుంబాల వారు బిఆర్ఎస్ పార్టీ ని వీడి మాజీ ఎమ్మెల్యే పాయం సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వీరికి ఆయన కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. మాయ మాటలతో, అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. .పేద ప్రజలకి మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ఈ నెల 30 న జరగబోయే ఎన్నికల్లో హస్తం గుర్తు పై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు .ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.