ప్రజలు అసత్య ప్రచారలను నమ్మొద్దు – మంత్రి గంగుల కమలాకర్
ప్రజలు అసత్య ప్రచారలను నమ్మొద్దు
– మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ ,శోధన న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసిఓర్వలేక ప్రతిపక్షాలకు కడుపు మంట కళ్ళు మండి విష ప్రచారం చేస్తున్నాయని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
శనివారం తీగల వంతెనను నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, చల్లా హరిశంకర్ తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణకు తలమానికమైన కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పై తలెత్తిన చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దదిగా చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు, అయోమయానికి గురి చేస్తూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. కేబుల్ బ్రిడ్జి నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవని ప్రపంచంలోనే పెద్దపెద్ద ప్రాజెక్టులు నిర్మించిన టాటా సంస్థ ఈ నిర్మాణం చేపట్టిందని, పూర్తిస్థాయిలో నాణ్యతతో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు.