ప్రజల మధ్య నే ఉంటా -మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
ప్రజల మధ్య నే ఉంటా
-మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
సత్తుపల్లి, శోధన న్యూస్ : ప్రజా తీర్పును శిరసావహిస్తూ ప్రతిపక్ష నేతగా నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సత్తుపల్లి లో ఆయన సమావేశమై భవిష్యత్ కార్యాచరణను వివరించారు. తనకు అవకాశం ఉన్న మేరకు నియోజకవర్గ అభివృద్ధి కోసం
85 కమ్యూనిటీ హాల్ లు, ఆసుపత్రులు, పలు అభివృద్ధి పనులు పూర్తి కావచ్చాయని, వాటిని త్వరతిగతిన ప్రారంభించే విధంగా చూడాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మట్ట రాగమయిని కోరారు. . ప్రతి కార్యకర్తకు అండగా ఉంటు వారితో కలిసి కాంగ్రెస్ హామీల అమలు కోసం పోరాడతా అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు పద్ధతిన పోస్టింగ్ లు పెడుతున్నారని, ఇది మంచి విధానం కాదని సండ్ర హితవు పలికారు . భారతదేశం ప్రజాస్వామ్య దేశం అని, కార్యకర్తలు ఎవరు ఆందోళన ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ధైర్యం చెప్పారు. నియోజకవర్గంలో 2500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎన్నికల కోడ్ కారణంగా పెండింగ్ లో ఉన్నాయనీ, రాజకీయాలకు అతీతంగా వాటిని ప్రజలకు అందజేయాలని కోరారు. కొంతమంది సామాజిక మాధ్యమాల్లో బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఫోన్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారనీ, కార్యకర్తలు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు ఇది ప్రజాస్వామ్య దేశం నేను అండగా ఉంటా అంటూ దైర్యం చెప్పారు. నిరంతరం సత్తుపల్లి ప్రజలతోనే నా ప్రయాణం కొనసాగుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోను సత్తుపల్లి కేంద్రం గానే పని చేస్తానన్నారు. ఎన్నికల్లో నాకు సహకరించిన నాయకులకు, కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో నియోజకవర్గం లోని ఐదు మండలాల బిఆర్ఎస్ అధ్యక్షులు, జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, స్థానిక కౌన్సిలర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, మల్లూరు అంకమరాజు, మోరంపూడి ప్రసాద్ ,మోరంపూడి ప్రభాకర్, సాదు జానకిరామ్, తుంబూరు దామోదర్ రెడ్డి, కాల్నేని వెంకటేశ్వరరావు, వల్లభనేని పవన్ తదితరులు పాల్గొన్నారు.