ప్రజాపంథా పార్టీ అభ్యర్థి కల్లూరి కిశోర్ ని గెలిపించండి
ప్రజాపంథా పార్టీ అభ్యర్థి కల్లూరి కిశోర్ ని గెలిపించండి
ములకలపల్లి, శోధన న్యూస్ : ములకలపల్లి మండలంలో సి పి ఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ కార్యాలయంలో ఎన్నికల జనరల్ బాడీ పోతుగంటీ లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ ఎన్నికల జనరల్ బాడీని ఉద్దేశించి సి పి ఐ యంఎల్ ప్రజాపంథా భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి పాల్గొని మాట్లాడుతూ అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి సి పి ఐ యంఎల్ ప్రజాపంథా పార్టీ అభ్యర్థిగా కత్తెర గుర్తుతో పోటీచేస్తున్న కామ్రేడ్ కల్లూరి కిషోర్ ని గెలిపించాలని ఓటరు మహశయులందరికి విజ్ఞప్తి చేసినారు. మతోన్మాద,ఫాసిస్టు బిజెపితో జతగా నడుస్తున్న బిఆర్ ఎస్ అభ్యర్థులను ఓడించాలని,కాంగ్రెస్ ను నిలదీయాలని అలానే ఊసరవెల్లి రంగుల మారేటోళ్ళు కల్లు బొల్లి మాటలు నమ్మి మోసపోవద్దుఅన్నారుఅలాగే అశ్వరావుపేట నియోజకవర్గం అభ్యర్థి అయిన కల్లూరి కిషోర్ ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సి పి ఐ యంఎల్ ప్రజాపంథా రాష్ట్ర నాయకులు ముద్దా బిక్షం, జిల్లా నాయకులు నుపా భాస్కర్, అమరపుడి రాము, పార్టీ డివిజన్ కార్యదర్శి గోకినెపల్లి ప్రభాకర్, పార్టీ డివిజన్ నాయకురాలు కల్లూరి పద్మ ,తిమ్మంపేట ఎంపీటీసీ నూపా సరోజిని, పాత గంగారం ఎంపీటీసీ మండపం విజయ, మండల నాయకులు పాల్గొన్నారు.