ప్రజాపాలన ప్రశాంతంగా సాగేందుకు సహకరించాలి – చర్ల సీఐ బి రాజగోపాల్
ప్రజాపాలన ప్రశాంతంగా సాగేందుకు సహకరించాలి.
– చర్ల సీఐ బి రాజగోపాల్
చర్ల, శోధన న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే క్రమంలో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు మండలంలో ప్రజాపాలన పేరుతో నిర్వహించనున్న కార్యక్రమాలకు ఎటువంటి అవాంతరాలు కలిగించకుండా ప్రతీ ఒక్కరూ సహకరించాలని చర్ల సిఐ బి రాజగోపాల్ సూచించారు.ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మండలంలోని వివిధ వర్గాల ప్రజలు ప్రభుత్వం అమలు చేయనున్న మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి చేయూత వంటి పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు గ్రామపంచాయతీల వారీగా ఏర్పాటు చేసే కేంద్రాలలో నేరుగా వెళ్లి దరఖాస్తులను అందజేయాలని ఆయన సూచించారు ప్రజాపాలన కార్యక్రమానికి ఆటంకాలు కలిగించడం గాని కార్యక్రమానికి వచ్చే వారికి ఇబ్బందులు కలిగించటం గాని, అధికారుల విధులకు ఆటంకం కలిగించడం వంటి ఘటనలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.