ప్రజాస్వామ్య పరిరక్షణకై సిపిఎం అభ్యర్థిని గెలిపించండి
ప్రజాస్వామ్య పరిరక్షణకై సిపిఎం అభ్యర్థిని గెలిపించండి
– సిపిఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్
అశ్వారావుపేట, శోధన న్యూస్ : ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం ఓటర్లు సిపిఎం బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్ పిలుపునిచ్చారు. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో సిపిఎం పార్టీ నుండి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పిట్టల అర్జున్ గెలుపును కాంక్షిస్తూ అశ్వరావుపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో జరిగిన సభలో పోతినేని మాట్లాడుతూ నేటి రాజకీయాలు పూర్తిగా కలుషితమైపోయాయని ధన బలంతోనే రాజకీయాలు మనుగడ సాగిస్తున్నాయని ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం అని అన్నారు. దీనిని నివారించడానికి సిపిఎం పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని దీనిలో భాగంగానే బలం ఉన్నచోట తమ అభ్యర్థులను నిలబెట్టి గెలుపు కోసం విస్తృత పోరాటం చేస్తున్నట్లు పోతినేని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అన్నవరపు కనకయ్య కొక్కెరపాటి పుల్లయ్య మాట్లాడుతూ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం సిపిఎం పార్టీ బలపరిచిన పిట్టల అర్జున్ ను ప్రజలు తమ మద్దతు ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పిట్టల అర్జున్, చిరంజీవి నాయుడు, పలువురు రాష్ట్ర ,జిల్లా స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.