ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్ల పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ రేగా
ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్ల పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ రేగా
మణుగూరు, శోధన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం లోని బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో ఈ నెల 13వ తేదీన బిఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహణ ఏర్పాట్లను, సభాస్థలిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మంగళవారం పరిశీలించారు. పనులను తానే స్వయంగా దగ్గరుండి పర్యవేక్షీస్తూ.. ఏర్పాట్లు చేస్తున్న వారికి సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ ప్రజా ఆశీర్వాద సభకు ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.