ప్రజా పాలనలో ప్రతి ఒక్కరికి సమన్యాయం
ప్రజా పాలనలో ప్రతి ఒక్కరికి సమన్యాయం
-నేటి నుండి పేదోళ్ల ఇంట్లో అభయహస్తం
-కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి వేముల భారతి
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది పేద ప్రజల కోసమని అశ్వరావుపేట ఎంపీటీసీ వేముల భారతీయ ప్రతాప్ అన్నారు పాలనపై నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నామని నేటి నుండి జనవరి 6వ తారీకు వరకు జరిగే ప్రజా పాలనను విజయవంతం చేయాలని ఆమె అన్నారు. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం జరగబోతుందని దరఖాస్తుతో తెల్ల రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు జతచేసి అందజేయాలని సూచించారు. ప్రభుత్వం నుండి లబ్ధి పొందడానికి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతినెల 2500 ఆర్థిక సాయం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ రైతు భరోసా పథకం కింద రైతులకు ప్రతి ఏట ఎకరానికి 15000, అదేవిధంగా వ్యవసాయ కూలీలకు సైతం 12 వేల రూపాయలను ప్రభుత్వం ఇవ్వబోతుందని అన్నారు, ఇందిరమ్మ పథకం ద్వారా అర్హులైన వారికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం, మరియు గృహ లక్ష్మీ పథకం చేయూత పథకం వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ల సైతం ప్రభుత్వం ఇవ్వబోతుందని అని అన్నారు.