ప్రజా పాలన కార్యక్రమ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలి -భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక
ప్రజా పాలన కార్యక్రమ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలి
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: ఈ నెల 28 నుండి జనవరి 6 తేదీ వరకు ప్రజా పాలన కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. ప్రజపాలన కార్యక్రమం నిర్వహణపై సోమవారం జిల్లా, నియోజక, మండల అదికారులు, మున్సిపల్ కమిషర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్యక్రమం.నిర్వహణపై 26వ తేదీ మంగళవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ, జిల్లా ఇంచార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మం కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించనున్నారని నిర్దేశించిన అధికారులు హాజరుకావాలని సూచించారు. ఈ నెల 28 వ తేదీ నుండి జనవరి 6 వరకు నిర్వహించనున్న ప్రజా పాలన కార్యక్రమం నిర్వహణపై ఉమ్మడి ఖమ్మం జిల్లా సన్నాహక సమావేశం రేపు ఉదయం 9.30 గంటలకు ఖమ్మం కలెక్టరేట్ లో నిర్వహించనున్నట్లు చెప్పారు. అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు, ఎంపిడిఓ లు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, డివిజన్ స్థాయి అధికారులు హాజరుకావాలన్నారు. ఈ సమావేశం లో ప్రజా పాలన కార్యక్రమం నిర్వహణపై మంత్రి అవగాహన కలిగిస్తారన్నారు. ప్రజా పాలన కార్యక్రమం 8 పని దినాలలో నిర్వహించాల్సి ఉందన్నారు. ప్రతి రోజు రెండు షిఫ్టులలో గ్రామసభలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒకటి, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఒకటి నిర్వహించుటకు షెడ్యూల్ తయారు చేయాలన్నారు. ప్రభుత్వ సెలవు రోజులైన డిసెంబర్ 31, జనవరి 1 మినహాయించి డిసెంబర్ 28 నుండి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించాలని అన్నారు. ప్రజా పాలన కార్యక్రమం గ్రామీణ ప్రాంతంలోని ప్రతి గ్రామ పంచాయతీలోను, పట్టణ ప్రాంతంలోని ప్రతి మున్సిపల్ వార్డులోను నిర్వహించాలన్నారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పధకాలకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. జిల్లాలో రేపు నిర్వహించనున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ప్రజాపాలన సన్నాహక సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 481 గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీల్లో నిర్వహణకు షెడ్యూల్ తయారు చేశామన్నారు. ప్రజా పాలన కార్యక్రమం నిర్వహణలో భాగంగా ప్రతి రోజు వచ్చిన దరఖాస్తులు ఆన్లైన్ తో పాటు నివేదికలు అందచేయాలని అధికారులకు సూచించారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు డాక్టర్ రాంబాబు, మధుసూదన్ రాజు, డిపిఓ రమాకాంత్, జడ్పి సీఈవో విద్యాలతతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపిడిఓలు తదితరులు పాల్గొన్నారు.