ప్రజా సమస్యలపై గొంతుకలను వినిపించే అవకాశం వచ్చింది -ప్రొఫెసర్ కోదండరాం.
ప్రజా సమస్యలపై గొంతుకలను వినిపించే అవకాశం వచ్చింది
-ప్రొఫెసర్ కోదండరాం.
సత్తుపల్లి, శోధన న్యూస్ : ప్రజా సమస్యలపై గొంతుకలను వినిపించే అవకాశం వచ్చిందని, ప్రజాస్వామిక తెలంగాణ కు పునాదులు పడ్డాయని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తొమ్మిదేళ్ళ క్రితం మనం పొందినది భౌగోళిక తెలంగాణ మాత్రమేనన్నారు.అసలైన ప్రజాస్వామిక తెలంగాణను పరిక్షించుకోవాలని, నాటి ఉద్యమ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.శనివారం స్థానిక కళాభారతిలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తొలి, మలి తరాల ఉద్యమ కారులను కలుసుకొని కాసేపు ముచ్చటించారు.ప్రగతి భవన్ ఇనుప కంచెలను కూలదోస్తున్నపుడు తెలంగాణ ప్రజలు తమచుట్టూ ఉన్న ముళ్ళకంచెలు తొలగినట్లుగా భావించారన్నారు.ప్రజాభవన్ లో వినతిపత్రాలను ఇవ్వడానికి వేలాదిమంది తరలి వచ్చి తమ బాధలను చెప్పుకుంటున్నారన్నారు.హైదరాబాదులో ఇందిరా పార్కువద్ద ఉద్యమ స్థలాన్ని పునరుద్దరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించటం ద్వారా ప్రజాసమస్యలపై గొంతుకలను వినిపించే అవకాశం కలిగించిందన్నారు . గత తొమ్మిదేళ్ళుగా మనం ఏమి కోల్పోయామో అవన్నీ ఈ ప్రభుత్వంలో పొందగలమన్న నమ్మకం కలిగిందన్నారు.మనమందరం కలసి చర్చించుకొని సమస్యలను ప్రభుత్వంతో కలసి పరిష్కరించు కుందామని అన్నారు. అనంతరం తెలంగాణ ఉద్యమం తొలి,మలితరం ఉద్యమకారులు ప్రొఫెసర్ కోదండరామ్ ను శాలువాలు,పూల మాలలతో సత్కరించారు. సత్తుపల్లిజిల్లా ఏర్పాటు ఆవశ్యకతను పింగిలి సామ్యూల్, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను నిమ్మటూరు రామకృష్ణ, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను వనమారెడ్డి చెంచురెడ్డి తదితరులు కోదండరాం కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆనాటి తెలంగాణ రాష్ట్ర సాధన జేఏసీ చైర్మన్, కన్వీనర్ చిత్తలూరు ప్రసాద్, కూకలకుంట రవి, సభ్యులు ఆదిల్ షరీఫ్, నాగా చారి, మధుసూదన్ రాజు, ఐ. వెంకటేశ్వరావు, పిల్లి మల్లికార్జున్, శరత్, సాగర్, అమీరుద్దీన్, పిచ్చయ్య, యనమల నాగరాజు, దారా ఏసురత్నం,జొన్నలగడ్డ రాజు మలిదశ ఉద్యమకారులు బొంతు వెంకటేశ్వరావు, కంచర్ల బాబురావు, కాంగ్రెస్ పార్టీ నాయకుల గాదె చెన్నకేశవరావు, గాదిరెడ్డి సుబ్బారెడ్డి, రామిశెట్టి సుబ్బారావు సిపిఐ నాయకులు తడికమళ్ళ ఏబు, సిపిఐ ఎంఎల్ నాయకులు గంట శ్రీను, అమర్లపూడి రాము, గోకినేపల్లి ప్రభాకర్, ఉమ్మడి ఖమ్మం జిల్లా టీజేఏసీ అధ్యక్షులు రంగరాజు, రాష్ట్ర జేఏసీ నాయకులు ధర్మార్జున్, అంబటి శ్రీనివాస్, గోపగాని శంకర్రావు , సత్తుపల్లి లాయర్స్ అసోసియేషన్ నాయకులు బోర్ర వెంకట్రావు , నల్లగట్ల విజయకుమార్, జనార్ధన చారి , సుదర్శన్ , తెలంగాణ ఉద్యమ ఫోరం నాయకులు బండి అంజిరెడ్డి, ఎల్ ఎస్ రెడ్డి, శివకృష్ణ, వెంకటేశ్వరావు, జలగం యువసేన అధ్యక్షులు ఇనపనూరి శ్రీనివాసరావు, సత్తుపల్లి, అశ్వరావుపేట నియోజకవర్గాల రాష్ట్ర సాధన ఉద్యమకారులు, రిటైర్డ్ ఉద్యోగులు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.