ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ అధికారం లోకి రావాలి
ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ అధికారం లోకి రావాలి
-జెడ్పీ చైర్ పర్సన్ కోరం కనకయ్య
– కాంగ్రెస్ లో 50 కుటుంబాలుచేరిక
ఇల్లందు, శోధన న్యూస్ : ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ అధికారం లోకి రావాలని జెడ్పీ చైర్ పర్సన్ కోరం కనకయ్య అన్నారు.శుక్ర వారం ఇల్లందు మండలం మర్రిగుడెం గ్రామపంచాయతీ లోని ఏడప్పల గూడెం గ్రామం లో సుమారు 50 కుటుంబాలు జెడ్పీ చైర్ పర్సన్ కోరం కనకయ్య సమక్షం లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలుప్రకటించిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం లో వార్డ్ మెంబెర్స్ ఏడుర్ల మన్నెమ్మ, కల్తీ స్వామీ, గ్రామ పెద్దలు మంకిడి సమ్మయ్యా, చింతా కృష్ణ, గోగ్గెల రమేష్, కల్తీ బయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.