ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి
- ఖమ్మం రూరల్ ఎస్పీ ఏసీబీ బస్వ రెడ్డి
తిరుమలాయపాలెం,శోధన న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఓటరు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ఏసిపి బస్వరెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఖమ్మం రూరల్ ఎస్పీ ఏసీబీ బస్వ రెడ్డి సూచించారు. మండల పరిధిలోని పిండిప్రోలు తెట్టెలపాడు గ్రామాల్లో కమిషనర్ ఆదేశాల మేరకు ఏసీబీ బస్వరెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ కవత్తు నిర్వహించారు. సమాజంలో తమ అమూల్యమైన ఓటును ప్రతి ఒక్కరు నిర్భయంగా స్వేచ్ఛగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రజల్లో చైతన్య కల్పించారు. గ్రామాల్లో ఎలాంటి రాజకీయ వత్తిళ్లకు బెదిరింపులకు ప్రలోభావాలకు లొంగకుండా ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఓటు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఎన్నికల సమయంలో పలు గ్రామాల్లో ఘర్షణలు చోటు చేసుకునే ప్రాంతాల్లో పోలీస్ కవాత్ నిర్వహిస్తున్నామని దీనివల్ల ప్రజల్లో చైతన్యం వస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ పోలీసులు కూసుమంచి సీఐ జితేందర్ రెడ్డి తిరుమలాయ పాలెం ఎస్సై వరాల శ్రీనివాస్ పలువురు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.