ఖమ్మంతెలంగాణ

ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

కామేపల్లి, శోధన న్యూస్ : గ్రామంలోని ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కామేపల్లి ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, వైద్యురాలు నెల్లూరి చందన అన్నారు.మండల పరిధిలోని పండితాపురం గ్రామంలో ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నిలువ ఉన్న మురికిగుంటలను పరిశీలించి లార్వా నిర్మూలించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.ప్రతి ఒక్కరూ మురుగునీరు నిలువ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.పరిసరాలను పరిశుభ్రతంగా ఉంచుకోవడం ద్వారా ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నెహ్రు నాయక్,గ్రామ ప్రజలు, వైద్య సిబ్బంది,పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *