ప్రతి ఓటర్ కు ఓటర్ స్లిప్ పంపిణీ చేయాలి
ప్రతి ఓటర్ కు ఓటర్ స్లిప్ పంపిణీ చేయాలి
-పినపాక ఎంపీవో వెంకటేశ్వరరావు
పినపాక, శోధన న్యూస్ : ప్రతీ ఓటరుకు బిఎల్ఓలు బాధ్యతాయుతంగా ఓ టర్ స్లిప్పులు తప్పక పంపిణీ చేయాలని పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు అన్నారు.బిఎల్ఓలతో కలిసి పినపాక మండల కేంద్రంలో ఓటర్ స్లిప్పుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క ఓటరుకు ఓటరు సమాచార స్లిప్పులు అందేలా పటిష్ట కార్యాచరణ అమలు చేశామన్నారు. ఓటరు స్లిప్పులతో పాటు పోలింగ్ బూత్ పేరు, క్రమసంఖ్య, పార్ట్ వివరాలు ఉంటాయన్నారు. ఓటరు సమాచార స్లిప్పు గురించి ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. ఇంటింటికీ తిరిగి ఓటరు స్లిప్పుతో పాటు, ఓటరు గైడ్, సివిజిల్ యాప్ పై రూపొందిన కరపత్రాన్ని అందిస్తున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓలు , పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.