ఖమ్మంతెలంగాణ

 ప్రతి పౌరుడి వజ్రాయుధం..ఓటు హక్కు

 ప్రతి పౌరుడి వజ్రాయుధం..ఓటు హక్కు

-ఏన్కూరు ఎస్ఐ బాదావత్ రవి

ఏన్కూరు, శోధన న్యూస్ : ప్రతి పౌరుడికి  వజ్రాయుధం ఓటు హక్కు అని  ఏన్కూరు ఎస్ఐ బాదావత్ రవి అన్నారు.మండల పరిధిలోని తూతక లింగన్నపేట గ్రామ సమీపంలో గుడ్ న్యూస్ ఇం గ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో ఓటు హక్కు పై విద్యార్థిని విద్యార్థులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో ఓటు హక్కు వినియోగించు కోవాలని పిరమిడ్ ఆకృతిలో విద్యార్థినీ, విద్యార్థులు ఏర్పడి అవగాహన కల్పించా రు. ఏనుకూరులోని జిల్లా పరిషత్ పాఠశాల నుంచి ప్రధాన సెంటర్ వరకు ప్లకార్డులు, జాతీయ జెండాలతో ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రదర్శన చేశారు. అనం తరం ఏన్కూరు ప్రధాన సెంటర్లో మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. సాంస్కృతి కార్యక్రమాలు నృత్యాలతో ఓటు హక్కు పై ప్రజలకు చైతన్యం కల్పించారు.ఈ సంద ర్భంగా ఎస్ఐ రవి మాట్లాడుతూ…ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు ను స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు.ఈనెల 30న జరిగే సార్వ త్రిక అసెంబ్లీ ఎన్నికల్లో పౌరులంతా ఓటు హక్కు సద్వినియోగంచేసుకోవాలని ఆ యన అన్నారు.గ్రామాల్లో ఓటర్లను ప్రభావితం చేస్తూ ప్రలోభాలకు గురి చేస్తే తమ దృష్టికి తేవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గుడ్ న్యూస్ ప్రధానోపాధ్యా యురాలు సిస్టర్ బ్రిటో, సిస్టర్లు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *