ప్రతి స్కానింగ్ సెంటర్ లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి -భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక
ప్రతి స్కానింగ్ సెంటర్ లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక
-భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ప్రతి స్కానింగ్ సెంటర్ లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా సూచించారు. బుధవారంభద్రాద్రి కొత్తగూడెం లోని కలెక్టర్ కార్యాలయంలో ఆమె జిల్లా వైద్య , ఆరోగ్య శాఖ అధికారితో కలిసి పీసీ అండ్ పిఎన్ డిటి డిఎల్ ఎంఎంఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ …. జిల్లాలో అబార్షన్ రేటును తగ్గించడం కొరకు ప్రభుత్వ , ప్రైవేటు ఆసుపత్రుల వారు ప్రతీ నెల అబార్షన్ల నివేదికను సమర్పించాలని సూచించారు. చట్ట విరుద్ధంగా లింగనిర్డారణ చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జెవిఎల్. శిరీష, ఎస్పీ షేక్ రెహమాన్, ఎం సి హెచ్ , పిసిపిఎన్డిటి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చైతన్య, డిపిఆర్ఓశ్రీనివాసరావు , డిప్యూటీ డెమోలు ఎండి ఫైజ్ మోహిద్దిన్, నాగలక్ష్మి ,హెల్త్ ఎడ్యుకేటర్ బేబీ పాల్గొన్నారు.