ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి -కామేపల్లి తహశీల్దార్ సుధాకర్
ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి
-కామేపల్లి తహశీల్దార్ సుధాకర్
కామేపల్లి, శోధన న్యూస్ : మండల పరిధిలోని గ్రామాల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ,యువకులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని కామేపల్లి తాహసిల్దార్ సుధాకర్ అన్నారు.మండల కేంద్రంలోని రైతు వేదిక నందు బిఎల్ వోలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన బిఎల్ వోలకు పలు సలహాలు సూచనలు అందించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా కృషి చేయాలని కోరారు.గ్రామాల్లో యువతీ యువకులకు అవగాహన కల్పించి ఓటు హక్కు పొందేలా చైతన్య పరచాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డిటి శంకర్,సిబ్బంది బిఎల్ వో లు తదితరులు పాల్గొన్నారు.