ప్రధాని మోడీ పథకాలే బిజెపిని గెలిపిస్తాయి
ప్రధాని మోడీ పథకాలే బిజెపిని గెలిపిస్తాయి
-బిజెపి మధిర నియోజకవర్గ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరావు
మధిర, శోధన న్యూస్ : బిజెపి ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే మధిరలో బిజెపి అభ్యర్థిని గెలిపిస్తాయని బిజెపి మధిర నియోజకవర్గ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరావు అన్నారు. మధిర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెరుమాళ్ళపల్లి విజయరాజు గెలుపును కాంక్షిస్తూ మధిర పట్టణంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరి నాగేశ్వరావు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే మధిరలో బిజెపి అభ్యర్థి పెరుమాళ్ళ పల్లి విజయరాజును గెలిపిస్తాయన్నారు. అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత బిజెపి ప్రభుత్వానికి దక్కిందన్నారు. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. బిజెపి అభ్యర్థి పెరమాలపల్లి విజయరాజు మాట్లాడుతూ నవంబర్ 30న జరిగే మధిర అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే మధిరను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల వల్ల మధిరలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పాపట్ల రమేష్, సీనియర్ నాయకులు కుంచం కృష్ణారావు, రామ యోగేశ్వరరావు, మర్సకట్ల స్వర్ణాకర్, పెరుమాళ్ళపల్లి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.