ప్రభుత్వ అధికారులతో సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి సమావేశం
ప్రభుత్వ అధికారులతో సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి సమావేశం
సత్తుపల్లి , శోధన న్యూస్ : సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి పంచాయతీ సత్యంపేట గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకొని ఇచ్చిన మాట ప్రకారం గెలిచినా 9 రోజుల్లోనే ప్రభుత్వ అధికారులతో కలిసి సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సమావేశమయ్యారు. 15సంవత్సరాలుగా రుద్రాక్షపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాలు ఈనాటికి వెనకపడి ఉండటం దారుణమని, ఈనాటికి సత్యంపేట గ్రామం రెవిన్యూ పరిధిలో లేకపోవడం గత ప్రభుత్వ వైఫల్యమన్నారు. మీ సమస్యలు తెలియపరచడానికి మా ఇంటి తలుపులు 24గంటలు తెరిచే ఉంటాయి మీరు ఏ సమయంలోనైనా మాకు మీ సమస్యలు తెలపవచ్చని, వెంటనే మీ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఎన్నికల రోజు గ్రామస్తులు ఓట్లు వెయ్యకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు మీ ఆవేదన ఆనాడే మాకు అర్ధం అయ్యిందని చెప్పారు. గ్రామంలో త్రాగునీరు, సీసీ రోడ్లు, అంగన్వాడీ బిల్డింగ్, కరెంటు లైన్లు, పెండింగ్ పట్టాలు, బాసారం నుండి సత్యంపేట గుడి వరకు రోడ్డు నిర్మాణం, సింగరేణి బాంబ్ బ్లాస్టింగ్ సమస్యలు, మరుగుదొడ్లు, రేషన్ కార్డ్ సమస్య ఇలా పలు సమస్యలపై చర్చించి అతి త్వరగా సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ ప్రజలు ఆనందంతో మట్టా దంపతులకు సన్మానం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ,అధికారులు ,ప్రజలు పాల్గొన్నారు.