ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వైద్య శిబిరం
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వైద్య శిబిరం
ఇల్లందు , శోధన న్యూస్ : ఇల్లందు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ (జాతీయ సేవా పథకం) యూనిట్స్ ఆధ్వర్యంలో గురువారం (అర్ బి ఎస్ కే) ప్రభుత్వ వైద్య బృందం వారు విద్యార్థులకు వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు చెవి, ముక్కు, గొంతు, చర్మ, కంటి, పుట్టుకతో వచ్చిన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి, పుట్టుకతో లోపాలు వ్యాధులు అభివృద్ధి ఆలస్యం వైకల్యం కోమర ఆరోగ్య సమస్యలతో 18 సంవత్సరాల లోపు పిల్లలకు డాక్టర్ ఎం. మనోహర్ ( మెడికల్ ఆఫీసర్) డాక్టర్ బి అరుణలు పరీక్షించి మందులు పంపిణీ చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న విద్యార్థులను ఉన్నతస్థాయి వైద్యం చేయించడానికి సిఫార్సు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ సి హెచ్ భాను ప్రసాద్, ఎన్ఎస్ఎస్( ఎన్ ఎస్ ఎస్) ప్రొగ్రాం ఆఫీసర్స్ తోర్తి జాన్, విలియం ప్రసాద్, లైబ్రరీయన్ ఎండి. ఖాసిం, ఏఎన్ఎం తార, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.