ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైద్య శిబిరం
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైద్య శిబిరం
ఇల్లందు, శోధన న్యూస్ : ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో సోమవారం కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం,భాగ్య హెల్త్ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో హెల్త్ డిపార్ట్మెంట్ ఆయుష్ మెడికల్ క్యాంపు నిర్వహించారుఈ కార్యక్రమానికి.కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పోలారపు పద్మ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ఆయుర్వేదము అతి ప్రాచీనమైన,సనాతనమైన నిత్య నూతనమైన,సకల వైద్య విధానములకు మూలమైన వైద్యశాస్త్రం అని, సంపూర్ణ ఆయువు గురించి తెలియజేయు శాస్త్రమేఈ ఆయుర్వేదమని,ఆయువు అంటే శరీరము ఇంద్రియాలు మనసు ఆత్మల కలయిక అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయశ్రీ ,మెడికల్ ఆఫీసర్ ఆయుష్ విభాగం మాట్లాడుతూ, ఆయుష్ అనగా 5 సంప్రదాయ వైద్య విధానాల సమూహారము అవి ఆయుర్వేదము, యోగ మరియు ప్రకృతి చికిత్స,యునాని,సిద్ధ మరియు హోమియోపతి అని, దినచర్య-రుతు చర్య,ఆరోగ్య పరిరక్షణ,జీవన శైలిలో మార్పులను ,ఆరోగ్యం ప్రాముఖ్యత,వంటింట్లో వైద్యము,పెరట్లో మందు మొక్కలు, గృహ వైద్యము గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ టి రాజు, భాగ్య హెల్త్ క్లబ్ కోఆర్డినేటర్ బి.చెంచు రత్నయ్య, బి.సరిత తదితరులు పాల్గొన్నారు.