ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ కు చర్యలు -భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ కు చర్యలు
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో శాసనసభ ఎన్నికల ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా న్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలకు ఎన్నికల సాధారణ పరిశీలకులుగా నియమితులైన గణేష్ శుక్రవారం జిల్లాకు చేరుకున్నారు. సింగరేణి విశ్రాంతి భవనానికి చేరుకున్న ఆయనకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల మొక్కను అందించి స్వాగతం పలిపారు. అనంతరం శాసనసభ ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లాలో చేపడుతున్న కార్యకలాపాలను జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక అల వివరించారు.