ఫారెస్ట్ శాఖ అద్వర్యంలో ఏక్తా దివస్ వేడుకలు
ఫారెస్ట్ శాఖ అద్వర్యంలో ఏక్తా దివస్ వేడుకలు
పినపాక, శోధన న్యూస్: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏడూళ్ళ బయ్యారంఫారెస్ట్ శాఖ అద్వర్యంలో ఏక్తా దివస్ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో భాగంగా అటవీశాఖ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్వి అద్వర్యంలో ఫారెస్ట్ సిబ్బంది కవాతు నిర్వహించి కార్యాలయం ఆవరణలో ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను పరిరక్షించడానికి అంకితమవుతూ.. దేశ వాసుల్లో ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి కూడా శాయశక్తులా కృషి చేస్తానని, సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నానన్నారు.ఐక్యత సర్ధార్ వల్లభాయ్‌పటేల్ దార్శనీయత, చర్యల ద్వారా సాకారం అయిందన్నారు. దేశ అంతర్గత భద్రతను కాపాడడానికి పాతుపడతామన్నారు. స్వాతంత్ర్య అనంతరం భారత్ ఐక్యతకు సర్ధార్ పటేల్ చేసిన కృషినీ ఈ సందర్భంగా గుర్తుచేసి, దేశానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.