ఫుట్ పాత్ హోటల్స్ , వాహనాల పార్కింగ్ తో రోడ్లు మాయం
ఫుట్ పాత్ హోటల్స్ , వాహనాల పార్కింగ్ తో రోడ్లు మాయం
సత్తుపల్లి, శోధన న్యూస్ : సత్తుపల్లి పట్టణం లో రాత్రి సమయంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఎదురవుతుంది ముఖ్యంగా ఫుట్పాతులపై ఏర్పాటు చేసిన హోటళ్లు , పానీ పూరి బండ్ల ముందు, వైన్ షాపుల ముందు ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలను పార్కు చేసి చాలా సమయం తీయకుండా ఉండడంతో మిగిలిన వాహనాలు రోడ్డుకి మధ్యలో వెళ్లడం వలన వెనుక నుండి వచ్చే వాహనాలకు ఇబ్బంది కలుగుతుంది . రోడ్డుకి సగం వరకు పార్కు చేసే ఈ వాహనాల వలన పిల్లలతో, పెద్దవారితో ద్విచక్ర వాహనాలు మీద వెళ్లేవారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . నిత్యం రోడ్లపై పలు రకాల పూలు పండ్లు విక్రయించే బండ్లు కూడా రోడ్డుమీద ఎదురెదురుగా రాంగ్ రూట్లో తోపుడు బండ్ల ను నడపడం వలన కూడా నిత్యం ఏదో ఒక ప్రమాదం సంభవిస్తూనే ఉంది . ఫుట్పాతులపై పండ్లు కూరగాయలు వ్యాపారం చేసే వారు రోడ్డు మొత్తం ఆక్రమించి ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నారు సాయంత్రం అవుతుంది అంటే కుటుంబంతో బయటకు రావాలి అంటే భయపడాల్సిన పరిస్థితి సత్తుపల్లిలో ఏర్పడింది ముఖ్యంగా రింగు సెంటర్ నుండి వేంసూరు రోడ్డు , బస్టాండ్ ఇన్ గేట్ వద్ద, కాకర్లపల్లి రోడ్డు వద్ద మరీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒకప్పుడు రోడ్డుమీద వ్యాపారం చేసే పూలు పళ్ళు కూరగాయల వ్యాపారస్తులు ఇప్పుడు పూర్తిగా రోడ్లను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారు. ప్రజలు ఈ సమస్యను ఎవరితో తెలియజేయాలో తెలియక ప్రతిరోజు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజల ఇబ్బంది తెలుసుకొని వీధి వ్యాపారస్తులు తమ వ్యాపార పరిధిలోని వ్యాపారాలు చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.