ఖమ్మంతెలంగాణ

 బాధిత కుటుంబానికి  ఇన్సూరెన్స్ చెక్కు అందజేత 

 బాధిత కుటుంబానికి  ఇన్సూరెన్స్ చెక్కు అందజేత 

కామేపల్లి, శోధన న్యూస్ : ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ ఆర్థిక భద్రత ఇస్తుందని సంపాదించే వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి అండగా ఉంటుందని కారేపల్లి సిఐ తిరుపతి రెడ్డి అన్నారు. బుధవారం కొమ్మినేపల్లి గ్రామానికి చెందిన మామిళ్ళ లక్ష్మీబాయి గత ఐదు సంవత్సరాల క్రితం శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు కొద్ది నెలల క్రితం ఆమె అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె భర్త చిన్న నర్సయ్య కు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సీఐ రూ 3,36,000 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ సంపాదించే వ్యక్తి ఆకస్మికంగా చనిపోతే ఆ కుటుంబం వీధిన పడకుండా ఇన్సూరెన్స్ ఆర్థికంగా కాపాడుతుందని తెలిపారు. ప్రతి కుటుంబం ఆర్థిక భద్రత కోసం ఇన్సూరెన్స్ చేయించుకోవాలని కోరారు. ఎలాంటి ప్రమాదం జరక్కుండా ఉంటే కట్టిన పాలసీకి వడ్డీ బోనస్ తో కలిపి డబ్బులు వస్తాయని వెల్లడించారు. ఇన్సూరెన్స్ అనేది మంచి పథకం అని అందరూ సంపాదించే దాంట్లో ఎంతో కొంత దాచుకోవాలని పిలుపునిచ్చారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ టైడ్ ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తాము నడిపే వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించుకునే వారు తమకు తాము ఇన్సూరెన్స్ చేయించుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాదని ఆరోగ్యం ఉన్నవారు కూడా అకాల మృత్యువాత పడుతున్నారని వెల్లడించారు. ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ పై అవగాహన పెంచుకొని తమ తమస్థాయిలో ఇన్సూరెన్స్ పాలసీలు చేయించుకోవాలని అది భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ జోనల్ మేనేజర్ అట్లా సురేష్, డివిజనల్ మేనేజర్ కుంచాల చిరంజీవి, ఖమ్మం బ్రాంచ్ మేనేజర్ పిన్ని సురేష్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ బి రాంబాబు,డెవలప్మెంట్ ఆఫీసర్ రాయల భిక్షమయ్య, సేల్స్ ఆఫీసర్ కె రాంబాబు పలువురు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *