బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పాయం
బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పాయం
అశ్వాపురం, శోధన న్యూస్: అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ దేవరపు వెంకటయ్య అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు గురువారం వారి ఇంటికి వెళ్లి ఆయన మృతదేహాన్ని సందరి ్శంచి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం అదే గ్రామంలో ఇటీవల మరణించిన చల్లా వెంకటరమణ కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. పరామర్శించిన వారిలో పిఏసీఎస్ చైర్మన్ తూక్కని మధుసూదన్ రెడ్డి, ఎంపీటీసీ కమటం నరేష్, ముత్తినేని వాసు, ఓరుగంటి రమేష్, గాదె కేశవరెడ్డి, బిక్కసాని సత్యనారాయణ, తూము పెద వీర రాఘవులు, ఆవుల రవి, రాగం మల్లయ్య, కొండబత్తుల ఉపేందర్, పర్వత నరేష్, నెహ్రు, దేపంగి వెంకటరమణ, వేల్పుల నారాయణ, పగిడిపల్లి కొమరయ్య తదితరులు ఉన్నారు.