బాలికా సాధికారతపై అవగాహన కల్పించాలి -కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
బాలికా సాధికారతపై అవగాహన కల్పించాలి
-కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, శోధన న్యూస్ : అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కస్తూరిభా విద్యాలయాల్లో బాలిక సాధికారికతపై అవగాహన కల్పించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పితి తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంల ప్రభుత్వ పాఠశాలలు, కస్తూరిభా విద్యాలయాల్లో క్లబ్ ల ఏర్పాట్లపై జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై మాట్లాడుతూ, బాలికలు చైల్డ్ హల్స్ లైన్ 1018, బాలికలు ఎదుర్కోంటున్న వేదింపులు, లైంగిక దాడులు, బాల్యవివాహాలు, లింగ వివక్ష, ఆరోగ్య సమస్యలు వంటి వాటిని దైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు. ఆడపిల్లల సాధికారతే లక్ష్యమని, బాల్యవివాహల చట్టం 2006 లైంగిక నేరాల నిరోదక చట్టం 2012 పై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు, డిడబ్ల్యుఓ సరస్వతి, జిల్లా వైద్యాధికారి లతిలాదేవి, తదితరులు పాల్గోన్నారు.