బాల్క సుమన్ దిష్టిబొమ్మ దగ్ధం
బాల్క సుమన్ దిష్టిబొమ్మ దగ్ధం
-ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే ఊరుకునేది లేదు
-కాంగ్రెస్ నాయకులు
మణుగూరు, శోధన న్యూస్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ దిష్టి బొమ్మను కాంగ్రెస్ నాయకులు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణం అంబేద్కర్ సెంటర్ లో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు పీరినాకి నవీన్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పోతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కురం వీరన్న మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డికు చెప్పు చూపిస్తూ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లో ప్రజలు ఓడించినా కూడా ఓటమిని తట్టుకోలేక బుద్ధి మందగించి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు వైస్ ఎంపీపీ కరివేద వెంకటెశ్వరరావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శివ సైదులు, పట్టణ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కురం రవి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సామ శ్రీనివాస్ రెడ్డి, ఎంకేఎం రాజు, సారంపల్లి రామిరెడ్డి , పుట్టి నారాయణ, బానోతు లక్ష్మణ్, ఐఎన్టియుసి నాయకులు వెలగపల్లి జాన్, మాజీ ఉప సర్పంచులు పుచ్చకాయల శంకర్, వీరంకి వెంకట్రావు గౌడ్, ఎంపీటీసీ గుడిపూడి కోటేశ్వరరావు, నాయకులు పెనుగొండ సాంబశివరావు, కొత్తపల్లి సత్యనారాయణ, కుంభం అంజయ్య, పాల్వంచ శ్రీను, అబ్దుల్లా, గాండ్ల సురేష్, యువజన నాయకులు చింతల కృష్ణ, సూర రాజు, జర్పుల జగన్, పల్లం నాగేశ్వరరావు, దాసరి లింగయ్య, బాగం రవి, చిన్న బుజ్జిబాబు, గడదాసు శంకర్, రోండా శ్రీకాంత్, సాయి, రామకృష్ణ, గుండె మధు, మహిళా కాంగ్రెస్ నాయకులు ఆముదాల శ్యామల, అనిత తదితరులు పాల్గొన్నారు.