బాల వెలుగు స్కూల్లో బతుకమ్మ సంబరాలు
బాల వెలుగు స్కూల్లో బతుకమ్మ సంబరాలు
మణుగూరు, శోధన న్యూస్: మండల పరిధిలోని సంతోష్ నగర్ బాల వెలుగు పాఠశాలలో శుక్రవారం సాయంత్రం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఆదివాసి విద్యార్థులు విద్యార్థులు తమ ఆట పాటతో మంత్ర ముగ్ధులను చేశారు, పాఠశాల నిర్వాహకులు బి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ సంబరాల ప్రత్యేకతను చిన్నారులకు వివరించారు ఈ కార్యక్రమంలో సింగరేణి సేవా సమితి సభ్యులు నా సర్ పాషా, మంగీలాల్, పాఠశాల సిబ్బంది సుహాసిని దేవి తదితరులు పాల్గొన్నారు.