బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఎంపీటీసీ విజయలక్ష్మి
బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఎంపీటీసీ విజయలక్ష్మి
అశ్వాపురం, శోధన న్యూస్ : అశ్వాపురం మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ ప్రముఖ న్యాయవాది పోరెడ్డి విజయలక్ష్మి సోమవారం టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు అయిన విజయలక్ష్మి కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడంపై కాంగ్రెస్ నాయకులకు పెద్ద షాక్ తగిలింది. విజయలక్ష్మి మణుగూరు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇనపాక నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన రేగా కాంతారావు చేతుల మీదుగా కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గం ఇంచార్జ్ కోనేరు సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్, సూది రెడ్డి గోపాలకృష్ణారెడ్డి, మణుగూరు జెడ్పిటిసి పోశం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.