బిఆర్ఎస్ తోనే కార్యకర్తలకు భరోసా
బిఆర్ఎస్ తోనే కార్యకర్తలకు భరోసా
-ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు
– ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మణుగూరు, శోధన న్యూస్: మున్సిపాలిటీ పరిధిలోని రాజుపేట ఏరియాలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గారి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 120 కుటుంబాలు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ… బిఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రజల మ్యానిఫెస్టో దేశంలో ఎక్కడైనా విధంగా సీఎం కేసీఆర్ రూపొందించారన్నారు. ఇందులో కేసీఆర్ చారిత్మత్మకం పథకం ఇది అమలు అయితే రాష్ట్రంలోని 90 లక్షల మంది పేద కుటుంబాలకు దీమాగా నిలుస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది రైతులకు రైతు బీమా ను ప్రభుత్వం అందజేసింది అని ఆయన అన్నారు ఏదైనా కారణంతో రైతు మరణిస్తే రైతు బీమా ఐదు లక్షల రూపాయలు వారి కుటుంబాలకు భరోసాగా అందజేయడం జరిగింది అన్నారు.
ప్రభుత్వమే ఏటా నాలుగువేల కోట్ల ప్రీమియం చెల్లిస్తున్నద అన్నారు. కొత్తగా అమలు చేస్తున్న మ్యానిఫెస్టోలో ప్రకటించిన కేసీఆర్ బీమా పేదింటికి బీమానిస్తున్నదని చెప్పారు గల్ఫ్ కార్మికులు శ్రామిక వర్గాలు ఇతర పనులు చేసుకునే వారందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అన్నారు. రేషన్ దుకాణాలలో ప్రతి కుటుంబానికి సన్న బియ్యం అందించడం గొప్ప ఆలోచన అన్నారు.ఇప్పటికే రాష్ట్రంలోని 24 వేల పాఠశాలలు, 1008 గురుకులాలలో సన్నబియ్యంతో భోజనం పెడుతున్న ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు.పింఛన్లలో తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ఎస్సీ ఎస్టిలకు బీసీ కు మైనార్టీలకు గురుకులాలు ఏర్పాటు చేసుకున్నామని, మూడోసారి బిఆర్ఎస్ సర్కార్ వస్తే అనే నియోజకవర్గాలలో అగ్రవర్ణాల పేదల కోసం గురుకులాలు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. పేద కుటుంబాలకు 400 కే సిలిండర్ అందజేస్తామన్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రతి పథకాన్ని యధావిధిగా కొనసాగిస్తామని అన్నారు. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ గారు ఒక భరోసా అని తెలిపారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి కోసం కృషి చేయడం గొప్ప విషయం అన్నారు. కాలేశ్వరం గ్రౌండ్ సక్సెస్ ప్రాజెక్టు అని వ్యవసాయ రంగం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.