తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

  బిఆర్ఎస్ ను గెలిపించి అభివృద్ధికి సహకరించాలి  –  ప్రభుత్వ విప్  రేగా కాంతారావు  

  బిఆర్ఎస్ ను గెలిపించి అభివృద్ధికి సహకరించాలి 
–  ప్రభుత్వ విప్  రేగా కాంతారావు  
 అశ్వాపురం, శోధన న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని ప్రభుత్వ విప్, భద్రాద్రి జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే  రేగా కాంతారావు అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల పరిధిలోని  కళ్యాణపురం,మిట్టగూడెం, పిచుకల తండా, పాయం మంగయ్య  గుంపు, పాములపల్లి, బట్టీల గుంపు, బట్ట మల్లయ్య గుంపు, అను శక్తి నగర్, సుందరయ్య గుంపు, పాములపల్లి ఎస్టి కాలనీ, అమ్మగారిపల్లి, అను శక్తి నగర్, కుమ్మరిగూడెం, జగ్గారం, జగ్గారం ఎస్సీ కాలనీ, మంచి కంటి నగర్ , అమేర్ధ, సండ్రల బోడు , చింతిర్యాల గూడెం,చింతిర్యాల కాలనీ,చింతిర్యాల, కట్టంవారిగూడెం, గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు , తొలిత స్థానిక ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లో ఉన్న పలు ఆలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పినపాక నియోజకవర్గం లోని అన్ని గ్రామాలు సమగ్ర అభివృద్ధి చెందాయని అన్నారు ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాయని అభివృద్ధి సంక్షేమని కొనసాగించేందుకు కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు, బిఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆసరా పెన్షన్లు రూ.5016కు, దివ్యాంగులకు పెన్షన్ 6 వేలకు పెంచుతామన్నారు,మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు అర్హులైన పేద మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామన్నారు, ఈనెల 30వ తేదీన జరిగే పోలింగ్ లో ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి సీఎం కేసీఆర్  నాయకత్వాన్ని బలపరచాలని తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు, సీఎం కేసీఆర్  దళితుల అభ్యున్నతికి దళిత బంధు పథకాన్ని తెచ్చి పది లక్షల రూపాయలు అందజేస్తున్నారని చెప్పారు. ఎన్నికలు పూర్తికాగానే హుజురాబాద్ తరహాలో పినపాక నియోజకవర్గం లోని ప్రతి కుటుంబానికి దళిత బంధు  అందజేస్తామని సీఎం కేసీఆర్  హామీ ఇచ్చారని కచ్చితంగా ఇస్తామని ఆయన చెప్పారు… ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బిఆర్ఎస్  నాయకులు  మహిళా, యువజన నాయకులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *