బిఆర్ఎస్ పార్టీలో చేరికలు
బిఆర్ఎస్ పార్టీలో చేరికలు
వైరా , శోధన న్యూస్: వైరా మున్సిపాలిటీ పరిధిలో 2 వార్డు లో బత్తుల చిన్ని, ఓర్సు పుల్లమ్మ,,గడదాసు స్వాతి. ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కి చెందిన 30 కుటుంబాలు సోమవారం వైరా నియోజకవర్గ బీఆర్ యస్ పార్టీ అభ్యర్థి బాణోత్ మదన్ లాల్ సమక్షంలో బీఆర్ యస్ పార్టీ లో చేరారు. వీరికి ఆయన గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పింఛన్ లు పెంచి అందిస్తున్న ఘనత సిఎం కేసీఆర్ ది అన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరల రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ వస్తే కేసీఆర్ బీమ ప్రతి ఇంటికి దీమా 5 లక్షలు,అన్నపూర్ణ పధకం ద్వారా అందరికీ సన్న బియ్యం,అసర పెన్షన్,రైతు బందు 16000 పెంపు,నియోజకవర్గానికి ఒక గురుకులం ఏర్పాటు,15 లక్షలు తో ఆరోగ్య రక్ష,మహిళలకు సౌభాగ్య లక్ష్మి ద్వారా ప్రతి నెల 3000, గ్యాస్ సిలిండర్ 400, మహిళ సమాఖ్యలకు సొంత భవనాలు వంటి పధకాలు అందించడం జరుగుతుందన్నారు. ప్రజలు ఆశీర్వాదించి కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని మదన్ లాల్ కోరారు.ఈ కార్యక్రమంలో బీఆర్ యస్ పట్టణ అధ్యక్షుడు మద్దెల రవి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీత రాములు, దిశ కమిటీ సభ్యులు కట్టా క్రిష్ణార్జున రావు,వర్తక సంఘం అధ్యక్షుడు కౌన్సిలర్ వనమా విశ్వేశరావు,బీఆర్ యస్ జిల్లా నాయకులు డాక్టర్ కాపా మురళి క్రిష్ణా, మాదినేని రామానారయణ,రామలయం చైర్మన్ మిట్టపల్లి సత్యం బాబు,మేదరమెట్ల శ్రీనివాస్ రావు, ఏదునురి శ్రీనివాస్ రావు,మాదినేని ప్రసాద్ బాణోత్ సక్కుబాయి,బిబా సాహెబ్,దోంతేబోయన వెంకటేశ్వర్లు,దోంతేబోయన గోపి,అదురి ప్రేమ్,వల్లేపు రాము,వేముల రవి,బత్తుల లింగరావు,దేవల్ల శ్రీను,సైదులు,ముల దుర్గా ప్రసాద్,,బత్తుల వెంకటేష్,వజినేపల్లి చక్రవర్తి,గుగులోత్ శివ మాచర్ల శంకర్,గుజ్జర్లపుడి దేవ రాజు,శ్రీనివాస్ రావు,, పుప్పల అనంతరమయ్య,ఏలురి నరసింహారావు,మంచికంటి అప్పారావు,మాదినేని లక్ష్మణ్,యండ్రతి గోపాలరావు, సోమవారం వల్లేపు రాము,వాంకుడోత్ విరన్న ,మాడుపల్లి క్రిష్ణా,నల్లగొండ నాని,ముదిగొండ పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.