తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిక 

బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిక 

మణుగూరు, శోధన న్యూస్ :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య   సమక్షంలో కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో  కరకగూడెం మండలం తుమ్మలగుడెం గ్రామానికీ చెందిన మాజీ ఎంపీటిసి తోలెం నారాయణ,కొత్తూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పాయం బాబు, గోగ్గలి భాటయ్య, రేగుళ్ళ గ్రామానికీ చెందిన వార్డ్ మెంబర్ గోగు భాస్కర్,అలాగె దూసరి రాజశేకర్, అంబోజు పురుషోత్తం, అంబోజు నరేష్, అంబోజు వెంకటేశ్వర్లు,నీట్ట సుందర్ రావులు బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.  వీరికి  జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా కమిటీ మెంబర్ కొమ్మ కృష్ణ , సీనియర్ నాయకులు ఎట్టి నర్సయ్య , మాజీ సర్పంచ్ మోకాళ్ళ పాపారావు, యువజన నాయకులు షేక్ ఇలియజ్, దయ్యాల సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *