బిఆర్ఎస్ పార్టీ లో చేరికలు
బిఆర్ఎస్ పార్టీ లో చేరికలు
పినపాక, శోధన న్యూస్ : పినపాక మండలంలోని మల్లారం గ్రామ పంచాయతీ లోని 20 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ ని వీడి బిఅర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సోమవారం బిఅర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో బిఅర్ఎస్ పార్టీ లో చేరారు. వీరికి బిఅర్ఎస్ పార్టీ కండువ కప్పి సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. బిఅర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు నిరూ పేద కుటుంబాలకు బాసటగా నిలిచాయని అన్నారు. సాధారణ ఎన్నికలలో బిఅర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో బిఅర్ఎస్ పార్టీ, నాయకులు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.