బిజెపి అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం
బిజెపి అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం
తల్లాడ, శోధన న్యూస్ : బిజెపి ద్వారానే అభివృద్ధి సాధ్యమని తల్లాడ మండల బిజెపి అధ్యక్షులు ఆపతి వెంకట రామారావు అన్నారు. తల్లాడ పట్టణంలో బిజెపి సత్తుపల్లి అభ్యర్థి నంబూరి రామలింగేశ్వర రావును గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ తల్లాడ మండల అధ్యక్షులు ఆపతి వెంకట రామారావు శుక్రవారం తల్లాడ మండలంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తల్లాడ, మిట్టపల్లి, నారాయణపురం, ఎన్టీఆర్ నగర్ గ్రామాల్లో తిరిగి కమలం గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ఆయన ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. ఎన్నికల్లో తెలంగాణలో కూడా బిజెపి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు కలకాల వెంకటరామయ్య, భాస్కర్, మట్ట ప్రసాద్, కృష్ణారావు, రమేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.