తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

బిజెపి అభ్యర్థి గెలుపు కోసం ప్రతి కార్యకర్తలు కృషి చేయాలి

బిజెపి అభ్యర్థి గెలుపు కోసం ప్రతి కార్యకర్తలు కృషి చేయాలి

అశ్వాపురం, శోధన న్యూస్ : ఈ నెల  30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పినపాక నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోడియం బాలరాజు గెలుపు కోసం బిజెపి ప్రతి కార్యకర్త చేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు  ముస్కు శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మొండికుంటలో బిజెపి మండల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ మండలంలోని ప్రతి ఓటరును కలిసే ప్రణాళిక రూపొందించుకొని అన్ని గ్రామాల్లో బిజెపి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో పినపాక నియోజకవర్గకన్వీనర్ పున్నం బిక్షపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య సీతారాం నాయక్, మొరంపల్లి బంజర సర్పంచ్ భూక్య దివ్యశ్రీ, జిల్లా కార్యదర్శి బత్తుల రామకృష్ణ, నియోజకవర్గ విస్తారక్ కొండి ప్రభాకర్ రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు సురకంటి లింగారెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు తాటిపాముల ఐలయ్య. కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కొల్లులింగారెడ్డి, ఓబిసి మోర్చా మండల అధ్యక్షులు గోసుల రాములు, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు సోమకృష్ణకుమారి, సోషల్ మీడియా కన్వీనర్ ఉమ్మ సుధాకర్ రెడ్డి, మండల కార్యదర్శి కోలా భాస్కర్, బండ్ల నాగేశ్వరరావు, పగడాల కృష్ణారెడ్డి, సురకంటి మల్లారెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *