ఖమ్మంతెలంగాణ

బి ఆర్ ఎస్ అభ్యర్థి కమల్ రాజ్ ప్రచార జోరు

బి ఆర్ ఎస్ అభ్యర్థి కమల్ రాజ్ ప్రచార జోరు

ఎర్రుపాలెం, శోధన న్యూస్ :  ఈనెల 30 న జరగనున్న అసెంబ్లీ ఎన్నిక ల్లో గెలుపే లక్ష్యంగా బి ఆర్ ఎస్ అభ్యర్థి జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు నియోజకవర్గం లో ని ఎ ర్రు పాలెం మండలం లో గురువారం పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించి కార్నర్ మీటింగు ల్లో మాట్లాడినారు. ప్రతి గ్రామంలో కమల్ రాజుకు మహిళలు స్వాగతం పలికారు. మీ అందరిని కోరుకునేది..ఒకసారి అవకాశం ఇవ్వాలని.. గెలిపిస్తే నిరంతరం మీకు అందుబాటులో ఉంటానని మీ కుటుంబంలో మీ బిడ్డగా చూడాలని అన్నారు. కారు గుర్తు పై ఓటేసి ఆశీర్వదించాలని అందరికీ అండగా నిలబడి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.ఎర్రుపాలెం మండలం లో అయ్యవారి గూడెం, మామునూరు, రాజుల దేవరపాడు గ్రామాల్లో.. కొండబాల కోటేశ్వరరావు తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ అరాచక శక్తులకు, అభివృద్ధి కి ఆటంకం కలిగించే వారికి ఈ ఎన్నికల్లో ప్రజలందరూ తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. రాజకీయ స్వార్థం కోసం కొందరు ఉంటారు. నా గెలుపు మీ అందరి కోసం అన్నారు .మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ నే అని మధిర అసెంబ్లీ ఎమ్మెల్యే గా నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా ఓటర్లను ఆయన కోరారు. తిరిగి మళ్లీ అధికారంలోకి రాగానే గ్యాస్ సిలిండర్ రూ 400 అందిస్తామని అలానే సౌభాగ్య లక్ష్మి పథకం కింద మహిళలకు రూ.3,000 వేల రూపాయల జీవన భృతి ఇస్తామన్నారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, రైతన్నలకు ఉచిత విద్యుత్తు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా గెలవాలన్నారు. కార్యక్రమంలో కొం డ బా ల కోటేశ్వరరావు, చావ రామకృష్ణ ,ఎంపీపీ దేవరకొండ శిరీష ,జడ్పిటిసి శీలం కవిత ,పార్టీ అధ్యక్షుడు పంబి సాంబశివరావు, ఎంపీటీసీ కృష్ణారావు, యెన్నం శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ మొగిలి అప్పారావు, కోట శ్రీనివాసరావు, హ ను మో లు సాంబశివరావు, మస్తాన్వలి, చిన్నం రాము ,దేవరకొండ చిరంజీవి, దేవరకొండ రవి, శీలం చిన్న వెంకటేశ్వర్లు, మన్నెం బాబు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *