బీఎస్పి కార్యాలయాన్ని ప్రారంభించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బీఎస్పి కార్యాలయాన్ని ప్రారంభించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
చెన్నూర్ ,శోధన న్యూస్: మందమర్రి మండలం క్యాథనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దెరాగడి ప్రాంతంలో బిఎస్పి పార్టీ కార్యాలయాన్ని బిఎస్పీ రాష్ర్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బిఎస్పి చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరపు శ్రీనివాస్ బిఎస్పీ నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్నారని తెలిపారు. మాట్లాడుతూ… చెన్నూరు నియోజకవర్గంలో గుండా రాజకీయాలకు అడ్డాగా మారిందన్నారు. అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గంగా చెన్నూరు తయారైందన్నారు.నియోజకవర్గానికి కాన్సర్ సోకిందని దానిని నయం చేయడానికే డాక్టర్ దాసరపు శ్రీనివాస్ చెన్నూరు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.