బీజేపిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
బీజేపిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
-సత్తుపల్లి నియోజకవర్గ అభ్యర్థి నంబూరి రామలింగేశ్వర రావు
పెనుబల్లి, శోధన న్యూస్: బారతీయ జనతా పార్టీ పెనుబల్లి మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం వియ్యం బంజర్ సెంటర్ జనసేన బలపరిచిన భారతీయ జనతా పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ అభ్యర్థి నంబూరి రామలింగేశ్వర రావు గడపగడపకు తిరుగుతూ మీ అమూల్యమైన ఓటును కమలం గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్ధించారు. తెలంగాణలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమని, అర్హులైన పేదలకు ఇల్లు నిర్మిస్తామని, అన్ని మండల కేంద్రాలలో ఆటోనగర్ నిర్మాణానికి స్థలం కేటా ఇస్తామని, అర్హులైన భార్యాభర్తలు ఇద్దరికీ పెన్షన్ అందజేస్తామని తెలిపారు. ప్రతి మండల కేంద్రానికి ఒక 108 వాహనం 104 వాహనము ఇస్తామని తెలిపారు. దేవాలయాలకు నిత్య ధూప దీప నైవేద్యాలు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొర్రా నరసింహారావు, జిల్లా అధికార ప్రతినిధి పడిగల మధుసూదన్ రావు, నియోజకవర్గ కన్వీనర్ వీరంరాజు, ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, జనసేన పార్టీ నాయకులు అనూష, పెనుబల్లి మండల ప్రధాన కార్యదర్శి ఓరుగంటి రాము, శరత్, భాను, రమేష్, పేర్ల మహేష్, అప్పారావు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సుదర్శన్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.