బీజేపీ నాయకుల విస్తృత ఎన్నికల ప్రచారం
బీజేపీ నాయకుల విస్తృత ఎన్నికల ప్రచారం
పెనుబల్లి, శోధన న్యూస్ : భారతీయ జనతా పార్టీ పెనుబల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జనసేన పార్టీ బలపరిచిన భారతీయ జనతా పార్టీ సత్తుపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి నంబూరు రామలింగేశ్వర రావు తుమ్మలపల్లి కొత్త కుప్పనగుంట్ల గ్రామాలలో గడపగడపకు తిరుగుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెట్టినటువంటి పథకాలు , భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ మేనిఫెస్టో వివరించారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని తక్షణమే వరి ధాన్యం, మద్దతు ధర 3100 ఇస్తామని తెలిపారు. అలాగే అరహలైన పేద వారందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇప్పిస్తామని తెలిపారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొర్ర నరసింహారావు, జిల్లా అధికార ప్రతినిధి పటికల మధుసూదన్ రావు, మండల ప్రధాన కార్యదర్శి ఓరుగంటి రాము, బానోతు రమేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.