బెటాలియన్ లొ ఘనంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్ వేడుకలు
15వ బెటాలియన్ లొ ఘనంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్ వేడుకలు
సత్తుపల్లి, శోధన న్యూస్: సత్తుపల్లి మండలం బి గంగారం 15వ ప్రత్యేక పోలీసు పటాలములో సర్ధార్ వల్లభాయి పటేల్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రీయ ఏక్తా దివాస్ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పటాలపు కమాండెంట్ పి వెంకట్ రాములు హాజరై సర్ధార్ వల్లభాయి పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పటాలపు కమాండెంట్ పి వెంకట్ రాములు మాట్లాడుతూ ఉక్కు మనిషిగా పేరుపొందిన సర్ధార్ వల్లభాయి పటేల్ జీవిత చరిత్రను అతని యొక్క కటోర దీక్షను చేయడమే కాకుండా దేశ సమగ్రతకు, జాతి ఇక్యతకు అతను చేసిన సేవలను కొనియాడారు. ఆ మహనీయుడి ఆశయ సాదనకై మనమందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పటాలపు కమండెంట్ అదికారులు, సిబ్బంది చేత రాష్ట్రీయ ఏక్తా దివాస్ యొక్క ప్రతిజ్ఞను చేయించి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పటలపు సహాయ దళాధిపతులు ఆర్ నాగేశ్వర రావు, ఎం శ్రీనివాసరావు, డీ ఏ వీ స్కూల్, గంగారం హై స్కూల్, విశ్వ శాంతి స్కూల్, సాయి స్పూర్తి కాలేజీ యజమాన్యాలు, విద్యార్ధిని, విద్యార్ధులు, పటలపు ఆర్ఐ లు, ఆర్ఎస్ఐ లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.