బోనకల్ లో కాం గ్రెస్ విజయోత్సవ ర్యాలీ
కాంగ్రెస్ విజయంతో విజయోత్సవ ర్యాలీ
బోనకల్, శోధన న్యూస్ : ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో రాష్ట్రంతో పాటు మధిర నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించడంతో బోనకల్ మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం సంబురాలు చేసుకున్నారు. భట్టి విక్రమార్క నాలుగోసారి వరుసగా విజయం సాధించడం పట్ల ఆనందంతో టపాసులు పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ సాధించడంతో ఆనందం వ్యక్తం చేస్తూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం,కాంగ్రెస్, వైయస్సార్ టిపి జెండాలతో బైకులపై ర్యాలీ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.