తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

భక్తిశ్రద్దలతో మహచండి అమ్మవారికి ప్రత్యేక పూజలు

భక్తిశ్రద్దలతో మహచండి అమ్మవారికి ప్రత్యేక పూజలు

మణుగూరు, శోధన న్యూస్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను మణుగూరు మండల వ్యాప్తంగా భక్తులు ఆనందో త్సాహాలతో జరుపుకుంటున్నారు. రోజుకో అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ తరిస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారు మహచండి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పైలట్కాలనీ కాళిమాత ఆలయంలో, సిఎస్పి ప్రాంతంలోని కనకదుర్గా ఆలయంలో, గుట్టమల్లారం గాయత్రిమాత ఆలయంలో. పికెఓసి దుర్గాదేవీ ఆలయంలో, సుందరయ్యనగర్, భగత్ సింగ్నగర్లో ఏర్పాటు చేసిన మండపాల్లో అమ్మవారు మహచండీ అవతారంలో దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకుల మంత్రోచ్చరణ నడుమ అమ్మవారికి కుంకుమార్చన, పుష్పార్చన వంటి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు భక్తుల చె తుల మీదుగా హోమాలు జరిపించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం భక్తులు తీర్ధప్రసాదాలు స్వీకరించి తరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *