భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి మహాపడిపూజ…
భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి మహాపడిపూజ…
-అయ్యప్ప నామస్మరణతో మారు మోగిన సీతారాంపురం….
కారేపల్లి, శోధన న్యూస్: మండల పరిధిలోని సీతారాంపురం గ్రామంలో చెన్నం శెట్టి భూషయ్య గురుస్వామి ఆధ్వర్యంలో 18వ పడి సందర్భంగా ఆదివారం రాత్రి శరత్(శ్రీ ఆదిత్య సాయి)నాగేష్, భద్రయ్య గురుస్వాముల తో కలిసి నగర సంకీర్తన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.ప్రదీప్ శర్మ గురుస్వామి సమక్షంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ కార్యక్రమాలతో ముందుగా హరిద్ర గణపతి పూజతో ప్రారంభించి గణపతి కుమార అయ్యప్ప స్వాముల పూజలు ప్రత్యేకంగా నిర్వహించారు.అనంతరం అయ్యప్ప స్వామి విగ్రహానికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు.శర్మ గురుస్వామి భజనతో భక్తి గీతాలు ఆలపించారు.ప్రత్యేక పూజలు18మెట్లపై కర్పూరం వెలిగించి అయ్యప్పలు తమ భక్తిని చాటుకున్నారు.అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బుచ్చి రాములు స్వామి,రమేష్ స్వామి,అమృస్వామి, బన్సీలాల్ స్వామి,మహేష్ స్వామి,నవీన్ స్వామి, మహేష్ స్వామి,కిరణ్ స్వామి,వివిధ గ్రామాల అయ్యప్ప స్వామి భక్తులు, మహిళా భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.