భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు
భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు
ఏన్కూరు, శోధన న్యూస్ : కార్తీక మాసంలో మూడోవ సోమవారం కావడంతో మండలంలోని బురద రాఘవ పురం గ్రామంలోని.. ఏనుకూరు గ్రామంలోని శివాలయాలు భక్త జన సందోహంతో కి టకిట లాడాయి.ఎంతో పవిత్రమైన కార్తీక మాసపు..మూడోవ సోమవారం కావడం తో భక్తులు శివాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.తెల్లవారు జాము నుంచే ఆలయాలలో భక్తుల తాకిడి మొదలైంది.వేద పండితులు సాంప్రదా యబద్ధంగా..శాస్త్రోక్తముగా శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామికి (పరమే శ్వరునికి ) నిర్వ హించిన పంచామృత అభిషేకాలను..సుగంధి ద్రవ్యాలతో..21రకా ల పండ్ల రసాల తో అభిషేకాలను చూసేందుకు భక్తులు బారులు తీరారు.తెల్ల వారు జామునే మహిళలు నిద్రలేచి..తలంటు స్నానాలు ఆచరించి,ఇండ్లను శుభ్ర పరుచు కుని ఇంటి గుమ్మం ముందు రంగవల్లులతో తీర్చిదిద్ది కార్తీక దీపాలను వెలిగించిన అ నంతరం దే వాలయాలను సందర్శించి ధ్వజస్తంభం దగ్గర..ఆలయ ప్రాంగణంలో..ఉ సిరి చెట్టు దగ్గర..తులసి కోట దగ్గర..మట్టి ప్రమిదల్లో 365 ఒత్తులు ఉంచి పసుపు, కుంకుమ,పూలతో అలంకరించి వాటిని ఆవు నెయ్యితో వెలిగించారు.దీంతో శివాల యాలు శివనామ స్మరణతో ఆ ప్రాంత మంతా మారు మ్రోగాయి.పరమేశ్వరునికి ఏ కాదశ రు ద్రాభిషేకాలు,లక్ష బిల్వార్చన,మహా లింగార్చన,సహస్ర లింగార్చన,పూజా కార్యక్రమా లు నిర్వహించారు.శివాలయాలతో పాటు మండల పరిధిలోని రేపల్లె వా డ-నాచారం గ్రామాల మధ్య వీరభద్రుని స్వామి గుట్టపై వెలసిన అద్భుత శ్రీ వెంకటే శ్వర స్వామి-పద్మావతి అమ్మవార్ల దేవాలయాలలో..గార్లఓడ్డు గ్రామంలోని శ్రీలక్ష్మీ న రసింహ స్వామి దేవాలయంలో..హిమాంనగర్ గ్రామంలోని శ్రీ పంచముఖ ఆంజనే య స్వామి దే వాలయంలో,తిమ్మారావుపేట..తూతక్క లింగన్నపేట..ఏనుకూరు గ్రామాలలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాలలో..చెరువు కట్ట బజారులోని దక్షిణ ముఖ అభయ ఆంజనేయస్వామి దేవాలయంలో..శ్రీ శిరిడి సాయిబాబా మం దిరములో..శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో మహిళలు, భక్తులు కా ర్తీక దీపాలను వెలిగించి,స్వామివార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ని ర్వహించారు.దీంతో భక్తులతో దేవాలయాలన్నీ కిటకిటలాడినాయి.