భక్తి శ్రద్దలతో కార్తీకపౌర్ణమి వేడుకలు
భక్తి శ్రద్దలతో కార్తీకపౌర్ణమి వేడుకలు
–భక్తులతో కళకళలాడిన శివాలయాలు
మణుగూరు, శోధన న్యూస్ : మండలంలో కార్తీకపౌర్ణమి వేడుకలను ప్రజలు సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. కార్తీకపౌర్ణమి సందర్భంగా మండలంలోని శివాలయాలు కార్తీకశోభను సంతరించుకున్నాయి. కార్తీకదీపాల వెలుగులతో ఆలయాలు కళకళలాడిపోయాయి. మణుగూరు మున్సిపాలిటి పరిధి శివలింగాపురంలో వెలసిన శ్రీనీలకంఠే శ్వరస్వామి ఆలయం భక్తుల రద్దీతో కళకళలాడింది. కార్తీకమాసం సందర్భంగా నెలరోజుల పాటు మహిళలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, దీపాలంకరణలు. ఉపవాస దీక్షలతో ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోతారు. కార్తీకపౌర్ణమి రోజు పవిత్ర గోదావరి స్నానాలు ఆచరించడం… దీపాలు వెలిగించి శివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే కటిక ఉపవాస దీక్షలు బూని తమ కుటుంబాలను చల్లంగా చూడాలని మహిళలు నియమనిష్పలతో వేడుకుంటారు. కార్తీకపౌర్ణమి సందర్భంగా భక్తులు కొండాయిగూడెం, చినరాయిగూడెం గోదావరి తీరాన స్నానాలు ఆచరించి గోదావరి తల్లికి పసుపు. కుంకుమలతో పూజలు నిర్వహించి దీపాలు వదిలారు. అనంతరం నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి వచ్చి దీపాలు వెలిగించుకున్నారు. ఆ తర్వాత పరమశివున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు. అభో షేకాల్లో పాల్గొన్నారు. శివున్ని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తులందరు తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తిపారవశ్యంలో తరించారు. తెల్లవారుజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దీపాలు వెలిగించడంతో దీపాల వెలుగులో నిలకంఠేశ్వర స్వామి ఆలయం శొ భాయమానంగా దర్శనమిచ్చింది. కొండాయిగూడెం గోదావరి నది తీరాన కొలువుదీరిన వైద్యనాథ లింగేశ్వరస్వామి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి వేడుకలను జరుపుకొని ఇంటల్లి పాది సుఖసంతోషాలతో గడపాలని శివపార్వతులను వేడుకున్నారు.